ఘనంగా బుల్లితెర సీరియల్ నటి త్రిష వివాహం!
on Dec 10, 2022
కరోనా టైములో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం కుదేలైపోయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా ఫుల్ ఎంటర్టైన్ చేసి ఇండస్ట్రీ మొత్తం కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
ఇక ఈ ఇయర్ మొదటి నుంచి చూసుకుంటే కరోనా టైములో వాయిదా పడిన పెళ్లిళ్లు అన్నీ ఈ సంవత్సరం ఘనంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర మీద చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష ఇప్పుడు ఎన్నో సీరియల్స్ మంచి మంచి పాత్రల్లో నటిస్తోంది. స్టార్ మాలో ప్రసారమైన ‘మనసిచ్చి చూడు’సీరియల్ లో కీర్తిభట్ చెల్లెలు రేణు పాత్రలో కనిపించి అలరించింది త్రిష.
ఇక ఇప్పుడు ఈమె ఘనంగా వివాహం చేసుకుంది. ఇక ఈ భర్త పేరు విశాల్. ఈమె వివాహానికి చాలా కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. త్రిష ఎన్నో మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాగే బుల్లితెర మీద చక్రవాకం, మొగలిరేకులు, భార్యామణి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి సీరియల్స్ లో కూడా నటించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
